2012 సంవత్సరంలో తెలుగునాట తెలంగాణ ప్రాంతం భద్రాద్రిలో "అతిరాత్రం", తిరిగి 2013లో తెలుగునాట మురమళ్లలో "అతిరుద్రం" వంటి మహోత్కృష్ట మహా యాగములు నిర్వహించిన బ్రహ్మశ్రీ కేసాప్రగడ హరిహరనాధశర్మ గారి పర్యవేక్షణలో జయనామ సంవత్సర పుష్య బహుళ అమావాస్య నుండి అనగా 2015 జనవరి 20 నుండి ఫిబ్రవరి 1 వతేదీ వరకు 13 రోజులు తెలుగునాట రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లా గార్గేయపురం గ్రామంలో అపూర్వ రీతిలో "అప్తోర్యామం"మహగ్నిచయన పూర్వక శ్రౌత సోమయాగం మరియు "మహాసౌరం" మహోత్కృష్ట స్మార్త యాగములు, ఒకేస్థలంలో, 2 యాగశాలలో, 2 బృందాలతో, ఒకేకాలములో మహాతపశ్శాలి గార్గేయ మహర్షి తపస్సు చేసిన దివ్యస్థలిలో, తుంగభద్రా నదీ పరీవాహక ప్రాంతమున అపూర్వంగా, అద్వితీయంగా జరుగనున్నవి. ఈ 'అప్తోర్యామం- మహాసౌరం" ఎన్నెన్నొ విశిష్టతల సమ్మేళనం. వేద-ఇతిహాస-పురాణాల్లో ప్రస్తావింపబడిన ఈ మహాయాగాల నిర్వహణలవలన ప్రకృతి- పర్యావరణముల పరిరక్షణ, అణువణువు చేదించి మృగత్వంతో మానవులు చేసే ప్రకృతి వినాశనానికి విరుగుడుగా సనాతన భారతీయ వేద విజ్ఞానంద్వారా కణము-కణము కలిపి ప్రకృతిలో జవజీవాలను నింపి, జీవద్రవ్యాన్ని పెంచటానికి క్లిష్టతరమైన ప్రక్రియతో గూడిన మహామంత్ర నివేదనతో చేసే మహొన్నత ప్రయోగం "అప్తోర్యామం" . అప్తోర్యామం ఏదిమనకు అవుసరమో ఆఫలాన్ని అందిస్తుందన్నది మహఋషుల సత్యవచనం. ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుని వివిధ విశేష మంత్ర- ప్రక్రియలద్వారా గ్రహ, నక్షత్ర, రాశ్యాధిపతుల అనుగ్రహమునొంది, జీవనగతిని సరైన మార్గంలో ప్రవేశింపజేసి ఆరోగ్యవంతులుగానుండి, కష్ట-నష్టముల బారినుండి జీవులకు రక్షణకొరకు వేదం మనకు అందించిన మహామంత్రోపాసనా ప్రక్రియ "మహాసౌరం" . ఈ రెండు మహాయాగముల నిర్వహణా విధానంలో ప్రతినిత్యం అనేక వివిధ విశేష హోమాదులు నిర్వహింపబడుచుండుటచే బహుళార్ధ ప్రయోజనములు చేకూరుతాయన్నది మహాఋషుల సందేశం. ఇట్టి మహామహిమాన్విత"అప్తోర్యామ-మహాసౌర" మహాక్రతువులను మహాజనం అధిక సంఖ్యలో దర్శించి, భగవదనుగ్రమును పొందమని విజ్ఞప్తి చేసున్నాం. ఎంతో వ్యయ-ప్రయాసలతో గూడిన ఈ మహాయజ్ఞములను ధనార్జనాపేక్షరహితంగా లక్షలాదిభక్తులకు జాతి,మత, కుల, వర్ణ, వర్గ విచక్షణా రహితంగా అన్నసమారాధనలతో లోగడ నిర్వహించి, లక్షలాది మహాజనుల మన్నలను, దైవానుగ్రహమును పొంది ఇప్పుడు తెలుగునాట రాయలసీమప్రాంతమున శ్రౌత సోమయాగ-స్మార్త యాగములు ఏకకాలమున వేలాదిమందికి అన్నప్రసాద సమారాధనలతో నిర్వహింపబడనున్నవి. ఎన్నో బృహత్తర ఏర్పాట్లకు, వస్తు సముపార్జనకు సమయము తక్కువగానున్నందున తక్షణం భక్తవరేణ్యులు, వితరణశీలురు తమ శక్తి-సామర్ధ్యములను బట్టి చేయూతనిచ్చి సహకరించి ఈ మహాయజ్ఞములను జయప్రదం గావించవలసినదిగా సవినయంగా ప్రార్ధిస్తున్నాం.
వివరములకు: ప్రజాహిత సేవా సమితి, రాజశేఖర శర్మ 9492028667; హరిహరనాధ శర్మ 9391025433
No comments:
Post a Comment